తెలంగాణ

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు గాంధారి 03/10/26 మండల కేంద్రంలోని తిప్పారం తండా గ్రామపంచాయతీలో గల అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు గాంధీ జయంతిని లాభాన మహిళలు ఘనంగా నిర్వహించారు. గాంధీజీ దేశం కోసము బ్రిటిష్ వారితో 30 సంవత్సరాలు పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం వచ్చేవరకు అలుపెరుగని పోరాటం చేశారాయన. సత్యం, అహింస, శాంతి మార్గంలో అనేక పోరాటాలు చేసి భారతదేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన మహాత్మా అని అతని మార్గంలోనే గ్రామ అభివృద్ధికి చెందే విధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని బిషలన్ లాల్ కొనియాడారు. దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలను విద్యా, వైద్యo, పరిశుభ్రత పాటిస్తేనే దేశం బాగుపడుతుందని గంగారం సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ, టీచర్ శారద, చంద్రీ భాయ్ భారతి, సుందరి భాయ్ తాన్ సింగ్ రామ్ చoద్ మరియు పెంటయ్యలు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS