కూకట్పల్లిలో పత్రికా మిత్రుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి ముద్దుల మనవడు జనంపల్లి అరుష్ రెడ్డి జన్మదిన వేడుకలు కూకట్పల్లిలో పత్రికా మిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి, కార్యదర్శి ఆర్. రామచంద్రరావు, కమిటీ సభ్యులు కలిసి కేక్ కట్ చేసి చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పత్రికా సోదరులను శాలువాలతో సత్కరించి, స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జనంపల్లి పురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే పత్రికా విలేకరుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. నదిపై వంతెన ఎంత ముఖ్యమో, ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో విలేకరులు అంతే ముఖ్యమని పేర్కొన్నారు. సమాజంలోని సమస్యలను ప్రజల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికా రంగం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.అటువంటి గౌరవప్రదమైన పత్రికా మిత్రుల సమక్షంలో తమ మనవడు అరుష్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో అదృష్టంగా, సంతోషంగా భావిస్తున్నామని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పత్రికా మిత్రులు చిన్నారి అరుష్ రెడ్డిని ఆశీర్వదిస్తూ.. నిండు నూరేళ్లు ఆయు రారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, విద్యాబుద్ధులతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతూ ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండాలని మనస్ఫూర్తిగా దీవించారు.ఈ కార్యక్రమంలో రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి, కార్యదర్శి ఆర్. రామచంద్రరావు, కమిటీ సభ్యులు జి. ప్రసాద్, జి. నర్సింగరావు, లక్ష్మీనారాయణ, సూర్యనారాయణ, శ్రీధర్, టైగర్ పురుషోత్తం, గణేష్ మూర్తి, గ్రానైట్ సూర్యనారాయణ, సునీల్ పటేల్, కిషోర్, నాని తదితరులు పాల్గొని చిన్నారి అరుష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.