పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో నిర్మల్ పట్టణంలోశనివారం రాత్రి ఎన్టీఆర్ మినీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య , మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని, కోలాటం ఆడి సంబురాల్లో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ ఎం. రవి బాబు, డీఈ హరిభువన్తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
