పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో శనివారం రాత్రి నిర్మల్ పట్టణంలోని ఉధాసి మాటమ్ ఎన్టీఆర్ మార్గ్ ప్రియదర్శినినగర్ లో అన్సృత రెసొనెన్స్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నిర్మల్ దాండియా నైట్స్ – 2026’ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య , మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఉత్సాహంగా దాండియా ఆడుతూ కార్యక్రమంలో సందడి చేశారు. సంప్రదాయ దాండియా నృత్యాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ వేడుక పండుగ వాతావరణంలో ఎంతో వైభవంగా సాగింది.అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య మరియు వైస్ చైర్మన్ శ్రీ అప్పాల గణేష్ చక్రవర్తి ని నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.