*చింతల చెరువు వద్ద 13 చోట్ల 100 వాట్స్ వీధి దీపాల ఏర్పాటు*
పయనించే సూర్యుడు, అక్టోబర్ 18,అశ్వాపురం: సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా అశ్వాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని చింతల చెరువు వద్ద బతుకమ్మ నిమజ్జనానికి వచ్చే ఆడపడుచులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలోని 23 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మలను కొమ్ముగూడెం వైపు దారిలోని చెరువు అలుగు వద్ద, అలాగే ఎస్సీ కాలనీలోని చెరువులోకి దిగే అలుగు వద్ద నిమజ్జనం చేసేందుకు తీసుకువస్తారు. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రాంతాల్లో మొత్తం సుమారు 13 చోట్ల 100 వాట్స్ వీధి దీపాలను ఏర్పాటు చేశారు. రాత్రివేళల్లో నిమజ్జనానికి వచ్చే ఆడపడుచులకు తగినంత వెలుతురు ఉండేలా చర్యలు చేపట్టడంతో పాటు, పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా అశ్వాపురం సర్పంచ్ బానోతు సదర్ లాల్ మాట్లాడుతూ, సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బతుకమ్మ నిమజ్జనానికి వచ్చే ఆడపడుచులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గ్రామపంచాయతీ తరఫున అవసరమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. వీధి దీపాల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని పేర్కొన్నారు.అలాగే రాత్రివేళల్లో సద్దుల బతుకమ్మ నిమజ్జన కార్యక్రమానికి ఎలాంటి విఘాతం కలగకుండా, శాంతిభద్రతల పరిరక్షణకు తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని గ్రామపంచాయతీ సర్పంచ్ బానోతు సదర్ లాల్ గారు సీఐ ఎల్లయ్య గారిని ఫోన్ ద్వారా కోరారు. దీనిపై సీఐ ఎల్లయ్య గారు సానుకూలంగా స్పందించి, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని అంగీకరించినట్లు సర్పంచ్ తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ బానోతు సదర్ లాల్, ఉప సర్పంచ్ తుల్లూరి ప్రకాష్ రావు అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ బతుకమ్మ పండుగను సంతోషంగా, భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తుల్లూరి ప్రకాష్ రావు, గ్రామ పెద్దలు ఈసంపల్లి కృష్ణ, గద్దల రామకృష్ణ, మిర్యాల బాలకృష్ణ, భూతం వెంకటేశ్వర్లు, మెడ అబ్బాయి, తడబోయిన వెంకటేశ్వరులు, నూకల లింగయ్య, కన్నెబోయిన లింగరాజు, శీలం సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది కూడా పాల్గొని ఏర్పాట్లలో సహకరించారు.