రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గురువారం లైన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. అలాగే రక్తదాన శిబిరంలో యువకులు, పెద్దలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, ఉప సర్పంచ్ నిస్సార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్, గ్రామ పెద్దలు బచ్చు రామ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ లక్ష్మీనారాయణ, వైద్య సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
