సినిమా వార్తలు

ఇందిరమ్మ ఇళ్ల విషయంలో రాజకీయ జోక్యం ఎందుకు?..- ఆవేదన వ్యక్తం చేసిన అంబం (ఆర్ )గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్..

ఇందిరమ్మ ఇళ్ల విషయంలో రాజకీయ జోక్యం ఎందుకు?..- ఆవేదన వ్యక్తం చేసిన అంబం (ఆర్ )గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్..

రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకం అని అయితే, రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో రాజకీయ జోక్యం జరుగుతోందనే ఆరోపణలు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయని గ్రామ సర్పంచ్ కుర్లేపు గంగాధర్, ఉప సర్పంచ్ రేపల్లి సాయిప్రసాద్ లు అన్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు అమాయక ప్రజలను మభ్యపెడుతూ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ పాత్రపై కూడా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. ఒకే గ్రామంలో గత నాలుగు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణల పై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయాలకు అతీతంగా, నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాల్సిన బాధ్యత కలిగి ఉంటారు. ముఖ్యంగా, ఇందిరమ్మ కమిటీ చైర్మన్ సర్పంచ్ సంతకం లేకుండానే ఇందిరమ్మ ఇల్లు కన్ఫర్మ్ చేశామని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఆ ప్రక్రియ ఏ నిబంధనల ప్రకారం చేపట్టారు? సంబంధిత అధికారుల ఆమోదం ఉందా? లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించారా? అనే అంశాలపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. పేద ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాజకీయ ప్రయోజనాలకు వేదిక కాకూడదని, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి న్యాయం జరగాలన్నారు. అనర్హులకు ప్రయోజనం కల్పించారనే అనుమానాలు ఉంటే వాటిని కూడా నిష్పక్షపాతంగా విచారించాలని కావున జిల్లా ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియలో నిబంధనలు పాటించారా?లేదా అన్నది తేల్చాలి. పంచాయతీ కార్యదర్శి విధుల నిర్వహణపై వచ్చిన ఆరోపణలను పరిశీలించి, తప్పులు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు నిజాలు తెలియాలని, అర్హులైన పేదలకు న్యాయం జరగాలని, ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత ఉండాలని పేర్కొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS