తెలంగాణ

నవదుర్గ సేన ఆధ్వర్యంలో అన్నదానం

నవదుర్గ సేన ఆధ్వర్యంలో అన్నదానం

పయనించే సూర్యుడు గాంధారి 15/10/26గాంధారి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ నవదుర్గ సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి మాజీ జడ్పీటీసీ హరాలే తానాజీ రావ్, ఉప సర్పంచ్ భాస్కర్ గౌడ్, విగ్రహ దాత వెంకట్ గౌడ్, విడిసి అధ్యక్షుడు ఆకుల రామస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న శ్రీ నవదుర్గ సేన సభ్యులను వారు అభినందించారు.ఈ కార్యక్రమంలో పాక్స్ ఛైర్మన్ పెద్దబూరి సాయికుమార్, వార్డు సభ్యులు పత్తి సాయిలు, గంగి రవి పలువురు నాయకులు, శ్రీ నవదుర్గ సేన సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు..

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS