
మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి సహకారం…
రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కామారెడ్డి జిల్లా, బాన్సువాడ నియోజకవర్గంలో గల దివ్యాంగులు (వికలాంగుల) కు మానవతా దృక్పథంతో కృత్రిమ అవయవాలు అందజేస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంతో పాటు చుట్టు పక్క గ్రామాలల్లో మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దివ్యాంగుల కోసం ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించారు. 10 మంది దివ్యాంగుల వివరాలు సేకరించామని, వీరి వివరాలను పోచారం భాస్కర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వీరికి ఉచితంగా కృత్రిమ అవయవాలను అందజేయనున్నట్లు మాజీ సొసైటీ చైర్మన్ పత్తి రాము తెలిపారు. ఎవరైనా దివ్యాంగులు ఉంటే తమకు తెలుపాలని వారికి పోచారం భాస్కర్ అన్న సహాయంతో ఉచితంగా కృత్రిమ అవయవాలు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ జడ్పిటిసి నారోజి గంగారం, నాయకులు తోట సంగయ్య, అక్కపల్లి నాగేందర్, తోట్ల గంగారం,కన్నె రవి వార్డు మెంబర్లు ఇమ్రాన్, దుర్కి రవి, ఈర్వ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.