ఆంధ్రప్రదేశ్

రూ.1.40 కోట్లతో నడవపల్లి పుష్కర ఘాట్ రహదారి పనులకు శంకుస్థాపన!

రూ.1.40 కోట్లతో నడవపల్లి పుష్కర ఘాట్ రహదారి పనులకు శంకుస్థాపన!

పయ నించే సూర్యుడు, అక్టోబర్ 13: ముమ్మిడివరం ప్రతినిధి కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి మరియు మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) స్పష్టం చేశారు. మంగళవారం కాట్రేనికోన మండలం నడవపల్లి గ్రామంలోని మావుళ్ళమ్మ గుడి నుంచి నడవపల్లి పుష్కర ఘాట్ కు వెళ్లే రహదారి నిర్మాణ పనులను రూ.1.40 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు ఆయన ఘనంగా శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంలో, గత ప్రభుత్వం సృష్టించిన భారీ అప్పుల భారాన్ని అధిగమిస్తూ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ‘పల్లె పండుగ’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో రహదారులు, కల్వర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పీఎం-జీఎస్-వై పథకం ద్వారా కూడా నియోజకవర్గంలోని ప్రతి పల్లెను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ పుష్కర ఘాట్ రహదారి పూర్తయితే భక్తులతో పాటు స్థానిక రైతులకు, ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడి ఆర్థికాభివృద్ధికి బాటలు పడతాయని వివరించారు.అదే సమయంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కూటమి నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చిన ఆయన, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల భారీ విజయానికి సమన్వయంతో, సమష్టిగా కృషి చేయాలని కోరారు. నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత కాలవ్యవధిలోగా ఈ పనులను పూర్తి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం రూరల్ మండల పార్టీ అధ్యక్షులు అర్దాని శ్రీను, కాట్రేనికోన మండల పార్టీ అధ్యక్షులు చెల్లి సురేష్, దాట్ల పవన్, కూటమి ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS