పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్.నిందితునికి శిక్ష పడేవిధంగా కృషి చేసిన సిబ్బంది ని అభినంధించిన పోలీస్ కమీషనర్ నిషేధిత మావోయిస్టు కార్యకలాపాలకు పాల్పడిన కేసులో నిందితుడికి ఈ రోజు తేదీ: 28.09.2026 నాడు గౌరవ న్యాయస్థానం 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ.5,000/- జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే, బూసా జనార్ధన్ @ గొల్ల జనార్ధన్ @ తొంటి జనార్ధన్, తండ్రి: లింబయ్య, వయస్సు: 55 సంవత్సరాలు, కులం: గొల్ల, వృత్తి: వ్యవసాయం, నివాసం: నారాయణపల్లి గ్రామం, న్యావనంది గ్రామపంచాయతీ, సిరికొండ మండలం, నిజామాబాద్ జిల్లా.నిషేధిత మావోయిస్టు కార్యకలాపాలకు పాల్పడినట్లు నమోదైన కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించి 2022 సంవత్సరంలో జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో SIగా విధులు నిర్వహించిన K. శ్రీకాంత్ నిందితుడిని చాకచక్యంగా పట్టుకుని , అతనిపై జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అనంతరం కేసు దర్యాప్తును నిజామాబాద్ డివిజన్ ACPలుగా పనిచేసిన A. Venkateshwar, M. Kiran Kumar మరియు L. Raja Venkat Reddyలు కొనసాగించి, సమగ్ర దర్యాప్తు అనంతరం గౌరవ న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేశారు.కేసును విచారించిన D. దుర్గ ప్రసాద్, IV అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి (మహిళా కోర్టు), నిజామాబాద్ గారు, అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ.5,000/- జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసు దర్యాప్తు మరియు విచారణలో ముఖ్యపాత్ర పోషించిన A. Venkateshwar, ACP; M. Kiran Kumar, ACP; L. Raja Venkat Reddy, ACP; G. Narender, ASI; K. శ్రీకాంత్, SIలను, అలాగే కేసు విచారణలో సాక్షులను సకాలంలో గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరిచి ప్రాసిక్యూషన్‌కు సహకరించిన M.Neeraja, Addl.Public Prosecutor, G. Mahesh, SI, జక్రాన్‌పల్లి PS; T. Govind, కోర్టు లైజన్ ఆఫీసర్; K. Chandrashekar, PC-1824; K. Ganesh, PC-2535; E. Kishore, PC-261లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్., ప్రశాంసిస్తూ అభినందించారు