సినిమా వార్తలు

దుర్గామాత మండపం వద్ద అన్నదాన కార్యక్రమం…

దుర్గామాత మండపం వద్ద అన్నదాన కార్యక్రమం…

పయనించే సూర్యుడు న్యూస్ : దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రుద్రూర్ గ్రామంలో దుర్గాదేవి మండపం వద్ద తొమ్మిది రోజులపాటు అమ్మవారిని రోజుకో అవతారంలో అలంకరిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహిస్తూ ఉత్సవాలను ఘనంగా జరుపు తున్నారు. మూడవరోజు మంగళవారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రుద్రూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో చదివిన (1993-1994) 10వ తరగతి బ్యాచ్ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లబే” అన్నపూర్ణాదేవి అంటే ఆకలి తీర్చే తల్లి, దుర్గామాతను శ్రీ అన్నపూర్ణ దేవిగా అలంకరించిన రోజు అన్న ప్రసాద వితరణ చేయడం మహాభాగ్యమని భావిస్తూ ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకు, కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పద్మ సాయినాథ్, కంచర్ల గగన్,చిలుక నర్సింలు, పార్వతి శేఖర్, కోటగిరి మురళి, వంజరి బాలాజీ, గుర్ల గోపి, ఎంబరి ఉమారాణి, బండారు కవిత, మంత్రి లక్ష్మణ్, గొల్ల శ్రీనివాస్, గాండ్ల శ్రీనివాస్, దుర్గామాత మాలధారణ స్వాములు, దుర్గామాత కమిటీ నిర్వాహకులు, సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS