తెలంగాణ

సూళ్లూరుపేట ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేతివాటం

సూళ్లూరుపేట ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేతివాటం

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 30 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణం నిమ్మ కు నిరెత్తని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సూళ్లూరుపేట పట్టణానికి నాలుగు దిక్కుల ఉన్న చెరువులన్నీ కబ్జాకు గురైనై విషయం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి తెలిసిన చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు ముడుపుల అందుకుంటున్నారేమో లేక అధికార పార్టీ నాయకులను భయపడుతున్నారా సూళ్లూరుపేట పట్టణం సరిహద్దులో ఉన్న ఎర్రబాలెం చెరువు గత కొన్ని రోజులుగా ఆక్రమణకు గురవుతూ వస్తున్నది అన్న సంగతిని ఎన్నిసార్లు అధికారులకు గుర్తుచేసిన దానిని పట్టించుకోని అధికారులు అలసత్వానికి నేడు ముగింపు జరిగింది పూర్తిస్థాయిలో ఆ స్థలాన్ని ఆక్రమించి అది కనుమరుగయ్యేలాగా ఆక్రమితదారులు దానికి మట్టి తరలించి పూర్తిస్థాయిలో ఆక్రమించేశారు ఎంత బలమైన ఆధారాలు ఉన్నా కూడా అధికారులు స్పందించక చూసి చూడనట్టు వదిలేస్తున్నారు రాబోయే కాలంలో సూళ్లూరుపేట పట్టణానికి వరదలు వస్తే ఏ హైదరాబాదో, చెన్నై నగరం లాగా పూర్తిస్థా యిలో మునిగిపోతుంది అన్నది మాత్రం నిజమే అధికారులకు పబ్బం గడిచిపోతుంది దానివల్ల నష్టపోయేది పన్ను కడుతున్న ప్రజలే కదా ఇంత పెద్ద టౌన్ కు ప్రత్యేక అధికారిగా ఆర్డీవో ఒక కమిషనరు ఎమ్మార్వో వీరందరి మీద పర్యవేక్షిస్తూ కలెక్టర్ ఇంతమంది కన్నుగప్పి ఎర్రబాలెం చెరువును ఆక్రమించే స్తున్నారంటే వారు ఎంత పెద్ద నాయకులై ఉంటారు అని ప్రజలు వాపోతున్నారు ఇంతకీ ఈ ప్రజల సొమ్మును అధికారులు కాపాడుతారా దారాదత్తం చేసేస్తారా వేచి చూడాల్సిందే

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS