పయనించే సూర్యుడుD,13,10,2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్, రాహుల్ గాంధీ నేతృత్వంలోని నిరసన కార్యక్రమంలో పాల్గొన్నబాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓట్ చోరీకి వ్యతిరేకంగా, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పాల్గొన్నారు.ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు గౌరవం, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి ఆయన సంఘీభావం తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని, ప్రతి ఓటరుకు తన ఓటు హక్కుపై పూర్తి విశ్వాసం ఉండేలా ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, ప్రజల ఓటు హక్కును పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.