పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ ,ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో కుల బహిష్కరణ అవాస్తమని తాళ్ల రాంపూర్ గ్రామస్తులు ప్రజావాణి లో కలెక్టర్ ను సోమవారం నిజాంబాద్ పోలీస్ కమిషనర్ ను కలిసి తమ గూడును వెల్లబోసుకున్నారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఊరిలో ఉన్న 15 కుల సంఘ సభ్యులు అందరూ కలిసి మెలిసి ఉన్నారని కొందరు అగ్రవర్ణ కులస్తులు కుల బహిష్కరణ చేశారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ కులస్తులను బహిష్కరణ కు గురి చేశారంటూ రాస్తారోకోలు ధర్నాలు చేస్తూ గ్రామస్తులను మనోవేదన గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకొని కొంతకాలంగా కొనసాగుతున్న సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు అంతకుముందు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేశారు అనంతరం సిపిని కలిసి గ్రామాలలో నెలకొన్న సమస్యపై తగు చర్యలు తీసుకోవాలని సీపీకి వినతి పత్రం ఇచ్చారు విన్నవించారు కావున ఈ తప్పుడు ప్రచారం చేస్తున్న గీతా కార్మికులపై కఠిన చర్యలు తీసుకోవాలని మా గ్రామంలోని అన్ని కులాల సభ్యులు కోరుచున్నాను
