సినిమా వార్తలు

అమలాపురంలో 3,600 మందితో ఘనంగా స్వచ్ఛ అమలాపురం కార్యక్రమం – పాల్గొన్న ఎమ్మెల్యే ఆనందరావుప్లాస్టిక్ రహిత అమలాపురం కోసం ప్రతి ఇంటికి జనపనార సంచి ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశం

అమలాపురంలో 3,600 మందితో ఘనంగా స్వచ్ఛ అమలాపురం కార్యక్రమం – పాల్గొన్న ఎమ్మెల్యే ఆనందరావుప్లాస్టిక్ రహిత అమలాపురం కోసం ప్రతి ఇంటికి జనపనార సంచి ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశం

పయ నించే సూర్యుడు అక్టోబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం: కిమ్స్ కోనసీమ ఆసుపత్రి ఆధ్వర్యంలో చైతన్య గ్రూప్ చైర్మన్ చైతన్య రాజు, కిమ్స్ నిర్వాహకులు రవి వర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ అమలాపురం కార్యక్రమం ఘనంగా జరిగింది. 36 వార్డుల్లో 3,600 మంది విద్యార్థులు, సిబ్బంది పాల్గొని పారిశుధ్య పనులు చేశారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా పాల్గొని శ్రమదానం చేశారు. పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చాలని, ప్రతి ఇంటికి జనపనార సంచి ఉచితంగా ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. స్వచ్ఛతలో అమలాపురంను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని కిమ్స్ కృషి చేస్తోందని చైతన్య రాజు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని, చెత్తను రోడ్లపై వేయవద్దని, బహిరంగంగా తగలబెట్టవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కిమ్స్ ప్రతినిధులు, వైద్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS