
రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో బుధవారం ప్లాస్టిక్ నిర్మూలన దిశగా గ్రామపంచాయతీ నుండి ప్రతి కిరణా షాపు, హోటల్లు, కల్లు దుకాణాలు, చికెన్ షాప్ లలో వారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం యుపిఎస్ పాఠశాల విద్యార్థులతో మానవహారంతో ప్లాస్టిక్ నివారణ గురించి, మత్తు పదార్థాల పై అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుర్లెపు గంగాధర్ మాట్లాడుతూ.. పర్యావరణం తో పాటు ప్రజలకు, మూగజీవాలకు ప్లాస్టిక్ కవర్లతో ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. కావున ప్లాస్టిక్ కవర్లను నిషేధించి, పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు బడే రాము, క్యాషియర్ సగరల్లి పండరి, వార్డు సభ్యులు రామసాని సాయిలు, సుంచు జోష్ణ, గ్రామపంచాయతీ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.