పయ నించే సూర్యుడు అక్టోబర్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాఅమలాపురం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందిద్దాం అనే సందేశంతో అమలాపురం కిమ్స్ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో కిమ్స్ వైద్య కళాశాల అధినేత, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ కులపతి రాజమహేంద్రవరం కె.వి.వి సత్యనారాయణ రాజు చైతన్య రాజు నిర్వహణలో స్వచ్ఛ అమలాపురం కార్యక్రమం ప్రజా భాగస్వామ్యంతో అక్టోబర్ 10వ తేదీ శనివారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు అమలాపురం పట్టణంలో 36 వార్డుల్లో 36 బస్సుల్లో 3600 మంది కిమ్స్ వైద్య కళాశాల విద్యార్థులు అధ్యాపకులు సిబ్బందితో స్వచ్ఛ అమలాపురం మహా యజ్ఞం నిర్వహించబడుతున్న నేపథ్యంలో ఈరోజున పట్టణంలోని ప్రముఖులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, విశ్రాంత ఉద్యోగులు, రెవెన్యూ సిబ్బంది విచ్చేసి తాము కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నట్లు ప్రకటించారు. మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల్లో ఒక్కొక్క వార్డులో వారి పరిధిలో స్వచ్ఛ అమలాపురం కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రముఖుల సమావేశంలో చైతన్య రాజు మాట్లాడుతూ స్వచ్ఛ అమలాపురం కార్యక్రమం మనందరిదీ అని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రజలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యాసంస్థలు, విశ్రాంత ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నందుకు ఆయన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ఆరోగ్యం కోసం, ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రత కోసం, స్వచ్ఛ యజ్ఞం నిరంతరం కొనసాగుతుందని త్వరలో కామన గరువు పంచాయతీ, ముమ్మిడివరం నగర పంచాయతీ, కొత్తపేట, రావులపాలెం, గన్నవరం, రాజోలు ప్రాంతాల్లో స్వచ్ఛ యజ్ఞం కొనసాగు తుందని ఆయన తెలిపారు. ప్రతి ఇంటి నుండి వీధి నుండి స్వచ్ఛత మొదలైతే ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆయన అన్నారు. స్వచ్ఛ అమలాపురం కార్యక్రమం ఆహ్వాన పత్రికలను చైతన్య రాజు వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ వైద్య కళాశాల వైస్ ప్రెసిడెంట్ మోహన్ రాజు, ఏపీ తహసిల్దార్ వి.ఎస్.దివాకర్, ఉపాధ్యాయ సంఘాల జిల్లా జేఈసీ చైర్మన్ ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ పప్పుల శ్రీరామ చంద్ర మూర్తి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పల్లంరాజు, జిల్లా ఎస్టీయూ అధ్యక్షులు పి.దోరబాబు, మాజీ సర్పంచి బి.ఆశీర్వాదం, విశ్రాంత ఉపాధ్యాయుడు ఎస్.వి.నాయుడు, బి.ఎన్.జి.ఎస్.గుప్త, ఉమ్మడి జిల్లా జేఏసీ అధ్యక్షులు జి.రామ్మోహన్, రాష్ట్ర ఎస్టీయూ వైస్ ప్రెసిడెంట్ ఎన్.శివప్రసాద్, ఎన్.సత్యనారాయణ, బి.ఎం.బి.ఎస్.గుప్తా, ఏ.రామానాయుడు, రెవెన్యూ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొంటామని తెలిపారు.