ఆంధ్రప్రదేశ్

సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా అనాతవరం-2 సేవా బస్తీలో ఉచిత వైద్య శిబిరం

సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా అనాతవరం-2 సేవా బస్తీలో ఉచిత వైద్య శిబిరం

ప య నించే సూర్యుడు అక్టోబర్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా చేపట్టిన సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా అనాతవరం-2 రామ్మోహన రావు సేవా బస్తీలో ఎంఎల్హెచ్పి శారద ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు గనిశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలైన ఉచిత వైద్యం, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి, ఉచిత బియ్యం, ఉజ్వల గ్యాస్, వాత్సల్య, విశ్వకర్మ యోజన, ముద్ర రుణాలు, జీవిత బీమా వంటి పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని కుటుంబ, గ్రామ, దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సేవా బస్తీలలో ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తేవడమే ఈ శిబిరం ముఖ్య ఉద్దేశమని, కేంద్ర పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని అన్నారు. కరోనా సమయంలో ఎఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, వైద్యులు చేసిన సేవలు మరువలేనివని, వారికి ఎప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు. కార్యక్రమంలో మట్టపర్తి శకుంతల, సాకే ఆశా, మండల అధ్యక్షుడు యనమదల వెంకటరమణ, గ్రామ ప్రజలు, ఉపాధి కార్మికులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS