తెలంగాణ

ప్రజా సౌకర్యాల కోసం వివేకానంద నగర్‌లో రహదారి విస్తరణకు చర్యలుఆర్టీసీ బస్సులు, ఆటోలు నిలిచేలా ప్రత్యేక ఏర్పాట్లు

ప్రజా సౌకర్యాల కోసం వివేకానంద నగర్‌లో రహదారి విస్తరణకు చర్యలుఆర్టీసీ బస్సులు, ఆటోలు నిలిచేలా ప్రత్యేక ఏర్పాట్లు

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 8 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ అరికపూడి గాంధీ గురువారం వివేకానంద నగర్ ప్రధాన రహదారి, సర్వీస్ రోడ్డులో పర్యటించి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రహదారి విస్తరణ చేపట్టి ఆర్టీసీ బస్సులు నిలిచేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తెలిపారు. వివేకానంద నగర్ కాలనీ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద బస్సులు, ఆటోలు నిలిచే విధంగా ప్రత్యేక ప్రాంతాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, రహదారిని విస్తరించే చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ సమస్యను తగ్గించవచ్చని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి రాజీ లేకుండా నిరంతరం కృషి చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జనంపల్లి పురేందర్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి అక్కడికక్కడే సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జనంపల్లి పురేందర్ రెడ్డి, కమిటీ సభ్యులు జి. నర్సింగ్ రావు, లక్ష్మీనారాయణ, సూర్యనారాయణ, జి. ప్రసాద్, సి.కె. రెడ్డి, కె.వి. రావు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS