రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ మండల కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జహీరాబాద్ పార్లమెంటు ఇంచార్జ్ ఎన్. వేణుమాధవ్, బాన్సువాడ నియోజకవర్గం నాయకులు షేక్ మతిన్ లు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో కవితకు మద్దతుగా నిలవాలని పేర్కొన్నారు. గ్రామ గ్రామాన జెండా కార్యక్రమాలు, పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమాలు చేపడతామన్నారు. విద్య, వైద్యం, సామాజిక న్యాయం కొరకు కవిత పోరాటం చేస్తుందని అన్నారు. ప్రజల అభివృద్ధి సంక్షేమ ధ్యేయమే కవిత లక్ష్యమని వివరించారు. ఈ సమావేశంలో బోధన్ నియోజకవర్గ టిఆర్ఎస్ నాయకులు షేరు పటేల్, యువ నాయకులు అవాద్ బీన్ అబ్దుల్లా, రుద్రూర్ మండల నాయకులు వైభవ్, సమీర్, సోను, రవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.