తెలంగాణ

రక్తదానం.. నిండు ప్రాణానికి ప్రాణదానంజాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రాందేవ్ రావు ఆసుపత్రిలో రక్తదాన శిబిరం

రక్తదానం.. నిండు ప్రాణానికి ప్రాణదానంజాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రాందేవ్ రావు ఆసుపత్రిలో రక్తదాన శిబిరం

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాందేవ్ రావు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విద్యార్థి నాయకుడు అశ్వంత్ కుమార్ హాజరై స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.ఈ సందర్భంగా అశ్వంత్ కుమార్ మాట్లాడుతూ.. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న ఒక నిండు ప్రాణాన్ని కాపాడినట్లవుతుందని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంచుకుని ముందుకు రావాలని కోరారు. ఆరోగ్యవంతులైన యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ద్వారా సమాజానికి ఎంతో మేలు చేసినవారవుతారని అన్నారు.రక్తదానం చేసిన అనంతరం శిబిరం నిర్వాహకులు, వైద్య సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. రక్తదానం ఒక సామాజిక బాధ్యతగా భావించి, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు అఖిల్, లక్ష్మీ ప్రసాద్, రాధాకృష్ణ, సందీప్, రాకేష్, భరత్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS