తెలంగాణ

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతి…

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతి…

రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రుద్రూర్ కమిటీ విస్తృతస్థాయి సమావేశంలో పెరుగుతున్న ధరలకనుగుణంగా హమాలీ రేట్లు పెంచుతూ బుధవారం సీఐటీయూ జిల్లా నాయకుడు నన్నేసాబ్ ఆధ్వర్యంలో హమాలీ యూనియన్ నాయకులు నిర్ణయం చేశారు. పెంచిన ధరల నోటీసును బుధవారం రుద్రూర్ తహసీల్దార్ కు అందజేశారు. రుద్రూర్ మండలంలో ఉన్న వడ్ల వ్యాపారస్తులకు, సిమెంటు, ఎరువుల దుకాణ యజమానులకు పెంచిన ధరల నోటీసులను అందజేశారు. వ్యాపారస్తులు, రైతులు, ప్రజలు, సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో హమాలీ కార్మికులు గంగాధర్, లక్ష్మణ్, మాహెబూబ్, భీమయ్య, శివ, ప్రసాద్, సాయిలు, శంకర్, రాజు, సాయందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS