సినిమా వార్తలు

భవిత సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి..

భవిత సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి..

నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందించడమే నా కళ…

ఎమెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి…

రుద్రూర్, పయనించే సూర్యుడు : రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ. 10 లక్షల 79 వేలతో నూతనంగా నిర్మించిన భవిత సెంటర్ ను బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. భవిత సెంటర్ లో దివ్యాంగులకు చదువుతో పాటు అన్ని రకాలుగా శిక్షణ ఇస్తారని, విద్య అనేది అందరి హక్కు అని అన్నారు. భవిత సెంటర్ ను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఎవరైనా దివ్యాంగులకు కాళ్లు, చేతుల వంటి పరికరాలు అవసరం ఉంటే మేము ఉచితంగా అందిస్తామని సూచించారు. బాన్సువాడ నియోజకవర్గంలో కుల మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి నిరుపేదకు ఇల్లు అందిస్తామన్నారు. డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల జాబితాలో కుల సంఘాల పెద్దలే నిర్ణితలన్నారు. L1, L2, L3 లిస్టులో కొందరి అనర్హుల పేర్లు రావడంతో అసలైన నిరుపేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కావున అధికారులు సమన్వయంతో పనిచేసి రీసర్వే నిర్వహించి అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందించాలని సూచించారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, ఉప సర్పంచ్ నిస్సార్, తహసీల్దార్ తారాబాయి, ఇంచార్జ్ ఎంపీడిఓ హరిప్రసాద్, ఎంఈఓ రామ్ సింగ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ విండో చైర్మన్ పత్తి రాము, తోట సంగయ్య, పత్తి లక్ష్మణ్, బద్దం సంజీవరెడ్డి, రాణంపల్లి సర్పంచ్ కొండలవాడి శంకర్, చిక్కడపల్లి సర్పంచ్ మచ్కూరి రమేష్, తోట్ల గంగారం, పార్వతి ప్రవీణ్, అక్కపల్లి నాగేందర్, వార్డు మెంబర్లు ఆమంద్ వెంకటేష్, ఇమ్రాన్, తాటి పాముల హరీష్, పూజిత, భవిత సెంటర్ హెడ్మాస్టర్ మోహన్, కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపాల్ శ్యామల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS