తెలంగాణ

విద్యార్థుల కోసం మోర్తాడ్–భీంగల్ మధ్య ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలి: .

విద్యార్థుల కోసం మోర్తాడ్–భీంగల్ మధ్య ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలి: .

పయనించే సూర్యుడుD.01.10.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. ఎన్‌ఎస్‌యూఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రెహమాన్* భీంగల్: మోర్తాడ్ మరియు పరిసర గ్రామాల నుంచి భీంగల్‌లోని వివిధ కళాశాలలకు ప్రతిరోజూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నారని, అయితే సరైన ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్‌ఎస్‌యూఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రెహమాన్ ఆర్మూర్ డిపో ఎస్ టి ఐ కి వినతి పత్రం సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ విద్యార్థులు సమయానికి కళాశాలలకు చేరుకోవడానికి ఉదయం వేళల్లో, అలాగే కళాశాలలు ముగిసిన అనంతరం సాయంత్రం వేళల్లో మోర్తాడ్–భీంగల్ మధ్య ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని,బస్సులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని, దీనివల్ల వారికి అదనపు ఆర్థిక భారం పడటంతో పాటు ప్రయాణ సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.కావున విద్యార్థుల భవిష్యత్తు మరియు వారి విద్యా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మోర్తాడ్–భీంగల్ మధ్య రామన్నపేట్,జాగిర్యాల్ , సుంకేట్ గ్రామాలను కలుపుతూ తగినన్ని ఆర్టీసీ బస్సులను వెంటనే నడపాలని ఆర్మూర్ డిపో ఎస్ టి ఐ ని కోరడం జరిగిందని, సానుకూలంగా స్పందించిన డిపో ఎస్ టి ఐ విద్యార్థుల సౌకర్యార్థం బస్సు సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ నాయకులు సిద్దు నందు సిద్ధార్థ అశోక్ సిద్దు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS