PS Telugu News
Epaper

అంగన్వాడీ కేంద్రం,& ప్రాధమిక పాఠశాల, & వాక్సినేషన్ ప్రోగ్రామ్ ను సందర్శించిన ఎంపీడీ ఓ

📅 08 Apr 2026 ⏱️ 6:25 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయ నించే సూర్యుడు ఏప్రిల్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్ముడివరం నియోజవర్గం కాట్రేనికోన మండలం ఎంపీడీఓ ఉప్పూడి పంచాయతీ స్వర్ణ గ్రామం ను విజిట్ చేసి, రికార్డులు తనిఖీ చేశారు. వివిధ సర్వేలపై సమీక్ష నిర్వహించి పెండింగ్ అంశాలపై సూచనలు ఇచ్చారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ సర్వేలను త్వరగా పూర్తి చేయాలని మార్గదర్శకాలు అందించారు.ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు . పంచాయతీలకు సంబందించిన పలు రికార్డులను తనిఖీ చేశారు. ఆయా స్వర్ణ గ్రామ సచివాలయం సిబ్బంది విధిగా సమయపాలన పాటించాలని,ప్రజనీకానికి నిరంతరం అందుబాటులో ఉంటూ, పౌర సేవలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు.పారిశుధ్యం, మంచినీరు మరియు వీధిదీపాలు వంటి మౌళిక అంశాలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక అధికారులతో సమన్వయం చేసుకొని ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. విధుల నిర్వాహణలో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రం, ప్రాధమిక పాఠశాల, మరియు వాక్సినేషన్ ప్రోగ్రామ్ ను సందర్శించి సిబ్బందికి కి తగు మార్గదర్శకాలు అందించారు

Scroll to Top