60 ఏళ్ల స్వరాష్ట్ర స్వప్నాని సహకారం చేసి కొత్త చరిత్ర సృష్టించిన కెసిఆర్
పయనించే సూర్యుడు 27 ఏప్రిల్ 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా 2001లో జలదృశ్యంలో పురుడు పోసుకున్నది బిఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల ప్రయాణంలో అనేక ఒడిదుడుకులను తట్టుకుని నిలబడ్డది. కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్ల అలుపెరుగని పోరాటం చేసి 60 ఏళ్ల స్వరాష్ట్ర స్వప్నాన్ని సహకారం చేసి కొత్త చరిత్ర సృష్టించినాడు కేసీఆర్
పోరాడి తెచ్చుకున్న తెలంగాణను 10 ఏండ్లు పాలించి అద్భుతాలు సృష్టించడం జరిగింది. కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలపడం జరిగింది.24 గంటల కరెంటుతో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల బతుకులు వెలుగులు నింపారు.మిషన్ కాకతీయకు అంకురార్పణ చేసి 46వేల చెరువులను పునరుద్ధరించారు. మిషన్ భగీరథ తో ఇంటి ఇంటికి నల్ల నీళ్లు అందించారు.నిరుపేద తల్లిదండ్రులకు కల్యాణ లక్ష్మితో సాంత్వన కలిగించారు.రైతు భరోసా ఇచ్చి అన్నదాతల బతుకులు మార్పులు తెచ్చారు ప్రపంచమే ఆశ్చర్యపోయేలా బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి వ్యవసాయ రంగా రూపురేఖలని మార్చి వేశారు. 26 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసిఆర్ కి భీంగల్ మండల ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య ,మాజీ జడ్పీటీసీ చౌటుపల్లి రవి, మాజీ రైతు బంధు అధ్యక్షులు శర్మ నాయక్, మాజీ జడ్పీ కాప్షన్ మోయీజ్, కౌన్సిలర్లు గున్నాల భగత్, భోదిరే నర్సయ్య ,నీలం రవి, మల్లెల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
