అశ్వాపురంలో బావుల క్లోరినేషన్ కార్యక్రమం
…….దగ్గర ఉండి పర్యవేక్షించిన అశ్వాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్
పయనించే సూర్యుడు, ఆగస్ట్ 14, అశ్వాపురం: అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ మరియు పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో బావుల్లో క్లోరినేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామపంచాయతీ పరిధిలో మొత్తం 5 ఓ హెచ్ ఎస్ ఆర్ ట్యాంకులు ఉండగా, వాటి ద్వారా మిషన్ భగీరథ తాగునీరు ప్రజలకు సరఫరా అవుతోంది బావుల్లోని నీటిని గ్రామ ప్రజలు ప్రధానంగా ఇంటి అవసరాలు, ఇతర గృహ వినియోగ పనులకు ఉపయోగిస్తున్నారు. బావుల నీరు కలుషితం కాకుండా, దోమలు మరియు హానికరమైన సూక్ష్మజీవుల వ్యాప్తిని నియంత్రించేందు కు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బావుల్లో క్లోరినేషన్ చేపట్టారు. ప్రజలు బావుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్త, మురుగునీరు బావుల్లోకి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామపంచాయతీ సూచించింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బానోత్ సదర్ లాల్, ఉపసర్పంచ్ తాళ్లూరి ప్రకాశరావు, వార్డు సభ్యులు మరియు పంచాయతీ సిబ్బంది పంచాయతీ కార్యదర్శి యాకూబ్ పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు