ఫరూక్ నగర్ మండల సింగిల్ విండో చైర్మన్ గా చల్లా శ్రీకాంత్ రెడ్డి
వైస్ చైర్మన్ గా తుపాకుల శేఖర్
చైర్మన్ వైస్ చైర్మన్ లను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే తదితర పార్టీ శ్రేణులు
( పయనించే సూర్యుడు ఆగస్టు 15 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)ఫరూక్ నగర్ మండల సింగిల్ విండో (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.అదేవిధంగా మండల వైస్ చైర్మన్ గా సీనియర్ నాయకుడు తుపాకుల శేఖర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఇరువురిని ఘనంగా సన్మానించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఫరూక్ నగర్ మండల పార్టీ అధ్యక్షుడిగా సేవలు అందించి స్థానిక ఎమ్మెల్యే గెలుపులో మండలాల వారిగా తన వంతు కృషిని అందజేసిన శ్రీకాంత్ రెడ్డి అదే విధంగా తుపాకుల శేఖర్ లకు తగిన గుర్తింపు లభించడం పట్ల పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న వారికి ఎల్లప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందని ప్రతి ఒకరు కష్టపడితే అందరికీ మంచి గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ల సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, చిలకమర్రి గ్రామ సర్పంచ్ రవీందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, పలు గ్రామాల రైతులు తదితరులు సన్మానించారు..