ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత షూస్ పంపిణీ
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో :ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠశాల బూట్ల పంపిణీ కార్యక్రమం గురువారం భైంసా మండల పరిధిలోని వాలేగాం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కంమ్లె అశోక్ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన నాణ్యమైన షూస్ జతలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ:పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం,విద్యార్థులు ఈ ఉచిత సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని,బడి పిల్లలకు యూనిఫాంలు, బూట్లు అందించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు.సజావుగా సాగిన పంపిణీ ప్రక్రియ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థుల పాదాల కొలతలకు (సైజులకు) సరిపోయేలా బూట్లను కేటాయించి పంపిణీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హెచ్ఎం రాధిక,పాఠశాల విద్యా కమిటీ (ఎస్ ఎం సి) చైర్మన్, అంగన్వాడి ఉపాధ్యాయులు సరస్వత, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.