సింగిల్ విండో చైర్మన్ శ్రీకాంత్ రెడ్డికి ఘన సన్మానం

August 14, 2026 | తెలంగాణ

రైతులకు అందుబాటులో ఉండాలి: బుజ్జి రాజు నాయక్

( పయనించే సూర్యుడు ఆగస్టు 15 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )ఫరూక్‌నగర్ సింగిల్ విండో (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) చైర్మన్‌గా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చల్లా శ్రీకాంత్ రెడ్డిని కడియాలకుంట తండా మాజీ సర్పంచ్ బుజ్జి రాజు నాయక్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. సింగిల్ విండో ద్వారా రైతులకు అవసరమైన సేవలు, రుణాలు, వ్యవసాయ సంబంధిత సహాయ సహకారాలు సకాలంలో అందేలా కృషి చేయాలని సూచించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధికి సహకరించాలని బుజ్జి రాజు నాయక్ ఆకాంక్షించారు. నూతన చైర్మన్‌గా శ్రీకాంత్ రెడ్డి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి రైతుల మన్ననలు పొందాలని ఆయన అభిలషించారు.

🌐 Select Language:
📰 ePaper