PS Telugu News
Epaper

ఎంజేపివిసి ఆధ్వర్యంలో మక్తల్ అసెంబ్లీ పరిధిలో వేసవి కాలం పది రోజుల శిక్షణ శిబిరం కెవి నరసింహ

📅 20 Apr 2026 ⏱️ 6:07 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్20

ఎంజేపివిసి ఆధ్వర్యంలో మక్తల్ అసెంబ్లీ పరిధిలో కృష్ణ మగానుర్ మక్తల్ ఉట్కూర్ నర్వ మండలంలలో ఆసక్తి గలవారికి వేసవి కాలం పది రోజుల శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నాం అని ఎంజేపివిసివ్యవస్థపాక అధ్యక్షులు కెవి నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు ఈ శిక్షణ కార్యక్రమం పాటలు ఎలా రాయాలి నేర్పించడం పాటలు ఎలా పాడాలి నేర్పించడం కవితలు ఎలా రాయాలి నేర్పించడం స్టేజ్ పై ఎలా మాట్లాడాలి నేర్పించడం స్వచ్ఛమైన రైటింగ్ నేర్పించడం సోసియల్ మీడియా పై అవగాహనా మోటివేషన్ శిక్షణ నిలువు రాళ్ళను సందర్శించి వాటి యొక్క చరిత్ర తెలుసుకోవడం తెలిపిన అంశాల పై పది రోజులు ఉంటుంది అని ఈ శిక్షణకు గాను 8వ తరగతి నుండి డిగ్రీ పూర్తి చేసిన వారు పాల్గొనవచ్చు అని తెలిపారు పాల్గొనాలి అని అనుకునేవారు 20/4/2026 సోమవారం ఉదయం నుండి 10/5/2026 ఆదివారం సాయంత్రం వరకు ఫోన్ పే గూగుల్ పే నంబర్ 9393203075 కు 111 రూపాయలతో మీ పేరును రిజిస్టర్ చేసుకోగలరు అని తెలిపారు రిజిస్టర్ చేసుకున్న తరువాత 11/5/2026 సోమవారం నాడు శిక్షణ స్థలం ఎక్కడ సమయం శిక్షణ ఇచ్చేవారి సంబందించిన పూర్తి వివరాలు వెళ్లాడిస్తాం అని తెలిపారు ఈ శిక్షణలో మంచి ప్రతిభను కనబరిచిన వారికి ఆకర్షనియమైన బహుమతులు ఇవ్వడం జరుగుతుంది కావున మక్తల్ అసెంబ్లీ పరిధిలో ఉన్న ప్రతిభ వంతులు వెంటనే మీ పేరును నమోదు చేసుకోగలరు అని ఎంజేపివిసి వ్యవస్థపాక అధ్యక్షులు కెవి నరసింహ తెలిపారు.

Scroll to Top