PS Telugu News
Epaper

ఏన్కూరులో గులాబీ జెండా రెపరెపలు… ఘనంగా బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు !

📅 27 Apr 2026 ⏱️ 3:46 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 28 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

ఏన్కూరు మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం నందు బిఆర్ఎస్ పార్టీ 26 వ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఎగురవేసి, నాయకులు బిఆర్ఎస్ స్థాపన వెనుక ఉన్న లక్ష్యాలను, పార్టీ సాధించిన విజయాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరై నినాదాలతో కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ముఖ్య నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధిలో బిఆర్ఎస్ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. గ్రామీణ అభివృద్ధి, రైతుల సంక్షేమం, సంక్షేమ పథకాల అమలులో పార్టీ చేసిన కృషిని వివరించారు. యువత, మహిళలు, వృద్ధులు భారీగా పాల్గొని కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తెచ్చారు. 4 కోట్ల ప్రజల కలలు నిజం చేయడానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు 2001 ఏప్రిల్ 27 న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసి ఎన్నెన్నో పోరాటాల నడుమ ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఘనత కేసీఆర్ ది. అనంతరం రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి గా పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశం లోనే నెంబర్ వన్ రాష్ట్రం గా మలిచారని వారు పేర్కొన్నారు..

Scroll to Top