PS Telugu News
Epaper

షాద్‌నగర్ వాలీబాల్ జట్టుకు గవర్నర్ చేతుల మీదుగా బహుమతులు

📅 25 Apr 2026 ⏱️ 7:06 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవంలో షాద్‌నగర్ జట్టుకు ద్వితీయ బహుమతి

( పయనించే సూర్యుడు ఏప్రిల్ 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం సందర్భంగా పార్లమెంట్ స్థాయిలో గత నెల రోజులుగా నిర్వహించిన క్రీడా పోటీలలో షాద్‌నగర్ వాలీబాల్ జట్టు ప్రతిభ చాటుకుంది. ఈ పోటీలలో షాద్‌నగర్ జట్టు ద్వితీయ స్థానాన్ని సాధించి, గవర్నర్ చేతుల మీదుగా ట్రోఫీతో పాటు రూ.25,000 నగదు బహుమతిని అందుకుంది.ఈ సందర్భంగా గవర్నర్ మరియు ఎంపీ డీకే అరుణ జట్టును అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ నియోజకవర్గ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య, నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, నియోజకవర్గ కోఆర్డినేటర్ వంశీకృష్ణ, లక్ష్మీకాంత్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో క్రీడాకారులు మరియు అభిమానులు హాజరయ్యారు.

Scroll to Top