ఐ కె పీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభంఎర్గట్ల
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ 15 4 20 26 నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో
ఎర్గట్ల మండలంలోని తోర్తి, నాగేంద్ర నగర్ గుమ్మిర్యాల్ ర్యాల, గ్రామ ల లో బుధవారం ఐ కే పీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా తొర్తి గ్రామ సర్పంచ్ కౌడ భూమేశ్వర్ మాట్లాడుతూ రైతులు తమ పంటను తప్పనిసరిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎఫ్‌సీఐ కొనుగోలు కేంద్రంలోనే అమ్ముకోవాలని సూచించారు. బయట దళారులకు తక్కువ ధరలకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని తెలిపారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో ధాన్యం తూకం, రవాణా సౌకర్యాలు కల్పించాలని . లారీలు సమయానికి అందుబాటులో ఉంచి ధాన్యం తరలింపులో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఐ కే పీ సిబ్బంది ని కోరారు . అలాగే రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు త్వరితగతిన జరగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం’ ఏ’ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్ కు 2389 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2369 రూపాయలు మద్దతు ధర ఇస్తుందని అన్నారు.రైతులు నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తద్వారా ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందాలన్నారు. ప్రభుత్వం చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమం లో మండల ఎమ్మార్వో మల్లయ్య రెవెన్యూ సిబ్బంది మహిళా సంఘ సభ్యులు,గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు..
