PS Telugu News
Epaper

జనగణన (సెన్సెస్) సంబంధించి రెండవ బ్యాచ్ మూడు రోజుల శిక్షణ తరగతులు ఎంపీడీవో కార్యాలయం నందు ప్రారంభించడం జరిగింది.

📅 15 Apr 2026 ⏱️ 6:27 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

మండల పరిషత్ కార్యాలయము, ముమ్మిడివరం నందు ఇండ్ల జాబితా గణన పై ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్ల కు మూడు రోజులు శిక్షణా తరగతులు ప్రారంభము అయినవి. ముమ్మిడివరం రూరల్ నందు 72 హౌస్ లిస్టింగ్ బ్లాకులకు గాను 68 మంది ఎన్యూమరేటర్లు మరియు 11 మంది సూపర్వైజర్ల ను నియమించినట్లు మే 1 నుండి 30 వ తారీఖు వరకు వీరు వారికీ కేటాయించిన హౌస్ లిస్టింగ్ బ్లాకులనందు ప్రజలనుండి వారి ఇండ్ల స్థితి, వసతులు, మొదలైన 34 రకాల వివరాలను మొబైల్ యాప్ ద్వారా సేకరిస్తారు అని తహసిల్దార్ మరియు ఛార్జ్ ఆఫీసర్ అయిన శ్రీ తాడి సుబాష్ తెలిపినారు ,ఈ కార్యక్రములో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ జె.ఎల్ .యెన్ . దీక్షితులు, డిప్యూటీ తహసిల్దార్ శ్రీ గోపాల కృష్ణ , ఏ.ఎస్.ఓ. శ్రీ కె .ఎల్.ఎన్. శాస్త్రి, మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ రామమోహన్ ,డిప్యూటీ ఎంపీడీవో లు, ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్ల లు హాజరైనారు

Scroll to Top