ఓటు అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు

June 19, 2026 | సినిమా వార్తలు

ఓటు హక్కును కాపాడుకోవడం మనందరి బాధ్యత


మక్తల్ నియోజకవర్గంలో సార్ పై అవగాహన శిక్షణా శిబిరం

పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా పరిశీలకులు రాజేంద్రప్రసాద్, మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బూత్ లెవెల్ ఏజెంట్ లు

:పయనించే సూర్యుడు జూన్ 20 మక్తల్:మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం లోని 7 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బూత్ లెవెల్ ఏజెంట్లతో సార్ (ఓటరు సవరణ ప్రక్రియ) పై అవగాహన శిక్షణా శిబిరం నిర్వహించారు. మక్తల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశం లో మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు రాజేంద్ర ప్రసాద్ లు బి ల ఆ లకు ఓటరు సవరణ ప్రక్రియపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
జూన్ 25 నుంచి జూలై 24 వరకు నిర్వహించనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. బూత్ లెవల్ ఆఫీసర్లు అందించే ఓటరు ఎన్యూమరేషన్ ఫారాలను అర్హులైన ప్రతి ఓటరుకు చేరేలా బూత్ లెవల్ ఏజెంట్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ సవరణ ప్రక్రియలో నియోజకవర్గంలో అర్హులైన ప్రతీ వ్యక్తి ఓటు హక్కును కాపాడేందుకు మనమందరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మక్తల్ లో 80 వేల ఓట్లను చో్రీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పశ్చిమ బెంగాల్ లో సార్ పేరుతో లక్షలాది ఓట్లను తొలగించి టీఎంసీ ని అధికారంలోకి రానీయకుండా బిజెపి అడ్డుకున్నదని మంత్రి విమర్శించారు. మన రాష్ట్రంలో కూడా లక్షలాది ఓట్లను తొలగించడానికి బిజెపి కుట్రలు చేస్తోందని మంత్రి దుయ్యబట్టారు. తెలంగాణ లో అలా జరగకుండా ఉండాలంటే మనందరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.నియోజకవర్గం లోని 7 మండలాల్లో ప్రతి బూత్ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఓటరు ఎన్యూమరేషన్ ఫారాలు అందని వారికి అవి చేరాలని స్పష్టం చేశారు . ఓటరు ఎన్యూమరేషన్ ఫారం సమర్పించకపోతే జూలై 30న విడుదలయ్యే ముసాయిదా ఓటరు జాబితాలో పేరు తొలగిపోయే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.తమ తమ గ్రామాల్లో ఓటరు జాబితాలో పేర్లు లేని వారిని గుర్తించి నమోదు చేయించాలని బూత్ లెవల్ ఏజెంట్ల కు పిలుపునిచ్చారు.ఓటరు సవరణ ప్రక్రియ ఈనెల 25న ప్రారంభమై వచ్చేనెల 24 వరకు జరుగుతుందని తెలిపారు. తర్వాత వచ్చే నెల 31న ముసాయిదా ప్రచురణ జరుగుతుందన్నారు. ఓటరు సవరణ ప్రక్రియలో అభ్యంతరాలు ఏమైనా ఉంటే జులై 31 నుండి ఆగస్టు 30 వరకు స్వీకరిస్తారని అంతలోపే మన ఓటు హక్కును కాపాడుకోవడానికి వీలవుతుందని మంత్రి సూచించారు.ఓటరు జాబితాలోని తప్పులను గుర్తించి సకాలంలో ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.ఒకవేళ ఊరు విడిచి వేరే ప్రాంతానికి వెళ్లినా ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని బి ల ఆ లకు సూచించారు.ఈ సందర్బంగా సమావేశానికి వచ్చిన వారితో ఓటు హక్కు పై మంత్రి వాకిటి శ్రీహరి ప్రతిజ్ఞ చేయించారు.

🌐 Select Language:
📰 ePaper