మక్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రెండు కంప్యూటర్లను బహుకరించిన వాకిటి శేషగిరి

June 19, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు జూన్ 20 మక్తల్: మక్తల్ పట్టణం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మంత్రి వాకిటి శ్రీహరి సోదరుడు వాకిటి శేషగిరి 2 కంప్యూటర్ సిస్టమ్స్ ను బహుమతి గా ప్రదానం చేశారు. మంత్రి క్యాంపు కార్యాలయం లో విద్యార్థుల సమక్షంలో మంత్రి చేతుల మీదుగా కళాశాల సిబ్బందికి అందజేశారు. ఈ సందర్బంగా డిగ్రీ మొదటి సంవత్సరం లో జిల్లాలో టాపర్స్ గా నిలిచిన నలుగురు అమ్మాయిలను షాలువాతో ఘనంగా సత్కరించారు. డిగ్రీ కాలేజీ కి త్వరలో కొత్త భవనాన్ని కూడా నిర్మించనున్నట్లు మంత్రి విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు డిగ్రీ కళాశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper