కార్మికవర్గ ఐక్యతకు,పోరాటాలకు సింబల్ నూర్జహాన్
పయనించే సూర్యుడు 17 ఏప్రిల్ 20 2 6 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్
విచ్ఛిన్నకరశక్తులకు వ్యతిరేక పోరాటమే ఆమెకు నివాళి సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ కీలక సమయంలో నూర్జహాన్ దూరమైంది ఆమె బాట ముందుంది.. పీడిత, తాడిత ప్రజానీకం
పట్ల పోరుసలపాలి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వీరయ్య సంస్మరణ సభలో జోహార్లు అర్పించిన పలువురు నిజామాబాద్ ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుడి జీవితంపై దాడి చేస్తూ కట్టుబానిసలుగా మార్చేందుకు నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. సంఘం పెట్టుకోకుండా, పోరాటాలు చేయకుండా, హక్కుల గురించి ప్రశ్నించకుండా ఎట్టిచాకిరీ చేయించాలని చూస్తుంది. ఈ క్రమంలో కార్మికులు, సంఘాలు ఐక్యంగా పోరాటాలు చేయకుండా కులం, మతం పేరిట దేవుడి పేరిట ప్రజలను, కార్మికులను చీల్చుతున్నారు. కార్మికవర్గ ఐక్యతకు, పోరాటాలకు నూర్జహాన్ సింబల్. కార్మిక విచ్చిన్నకర శక్తులకు వ్యతిరేకంగా పోరాటమే ఆమెకు నివాళి’ అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. సీఐటీయూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ ఈ నెల 11వ తేదీన అనారోగ్య సమస్యతో మృతిచెందగా.. యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శుక్రవారం సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాల అర్పించి నివాళి అర్పించారు. సీఐటీయూతో పాటు ప్రజా సంఘాల నాయకులు, వివిధ రంగాల కార్మికులు హాజరై నివాళి అర్పించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శంకర్ గౌడ్ అధ్యక్షత వహించగా.. ముందుగా పాలడుగు భాస్కర్ మాట్లాడారు. నూర్జహాన్ అతిచిన్న వయసులోనే పోరాటంలో పరుగులు పెడుతూ అభాగ్యులకు, దోపిడీకి గురవుతున్న వారికి అండగా నిలిచిన ధ్రువతార దూరమైందని అన్నారు. భౌతికంగా ఆమె లేకపోవడం ఇటు సీఐటీయూకు ఆటు ఆమె కుటుంబానికి తీవ్ర లోటు అని అన్నారు. ఆటంకాలు, ఒడిదుడుకులు ఎదురైనా పోరాటాలు ఆపకుండా ముందుకువెళ్లి నిలుచున్నారని, పోరాటం చేపడితే ఫలితం వచ్చే వరకూ పోరాటం చేసిన ధైర్యశీలీ, దీశాలని అని కొనియాడారు. నూర్జహాన్ అంటే ధైర్యం అని, అదే పాత్ర జిల్లా నాయకత్వం పోషించాలని, ఒక్కో కార్మికుడు ఒక్కో నూర్జహాన్ గా మారి పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీకి సహకారం అందిస్తుందని తెలిపారు. కీలకసమయంలో దూరమైంది : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య ఒక వైపు అమెరికా సామ్రాజ్యవాదంతో యుద్ధాలు చేస్తుండటంతో మన దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య అన్నారు. ఒక వైపు ధరల పెరుగుదల, మరో వైపు కార్మిక చట్టాల రద్దుతో కార్మికులపై నిరంకుశత్వంగా కేంద్రం వ్యవహరిస్తుందని, దీనికి తోడు మతం పేరుతో వైశమ్యాలు పెంచుతూ కార్మికుల ఐక్యతను విడగొడుతున్నారని ఇలాంటి సమయంలో కార్మిక ఐక్య ఉద్యమాలు నిర్వర్తించే నూర్జహాన్ కీలక సమయంలో మన నుంచి దూరమైయ్యారని అన్నారు. దోపిడీ వ్యవస్థ పోవాలి.. సోషలిస్టు సమాజం కావాలని తొలినుంచి నూర్జహాన్ కోరుకుందని, అది ఎర్రజెండాతోనే సాధ్యమవుతుందని పూర్తిగా విశ్వసించినట్టు తెలిపారు. తాను మహిళా అని ఏ నాడు అనుకోలేదని, ఎక్కడ, ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా ఎర్రజెండాతో కొట్లాడేదని అన్నారు. తన పిల్లలను కూడా ఎర్రజెండా వారసులుగా పెంచారని, కుటుంబీకులను సైతం ప్రభావితం చేశారని గుర్తుచేశారు. క్రమశిక్షణకు మారుపేరని, మాట కఠినంగా ఉన్నా మనసు మెత్తన అని, భౌతికంగా మన మధ్య లేకున్నా ఆమె బాట మన ముందుందని, ఐక్య పోరాటాలను ముందుకు తీసుకెళ్లడమే నూర్జహాన్ కు నివాళి అని అన్నారు.సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శంకర్ గౌడ్ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ రమ, జయలక్ష్మి, రాష్ట్ర కోశాధికారి ఒంగూరు రాములు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు రమేశాబాబు, వృత్తిదారుల సంఘం కన్వీనర్ పెద్దివెంకట్రములు, ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత, గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జంగం గంగాధర్, ఆశ జిల్లా కార్యదర్శి Sukanya, అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు కైరి దేవ గంగు కార్యదర్శులు స్వర్ణ, లిఫ్ట్ ఇరిగేషన్ నాయకులు గణేష్, మరియు శ్రీనివాస్, ఎఐటియుసి, TUCI, తదితరులు పాల్గొన్నారు.
