కూలిపోయే దశలో కాళంగి బ్రిడ్జి – భారీ వాహనాలపై నిషేధానికి రంగం సిద్ధం

June 16, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు జూన్ 16 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) ​ తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణానికి ప్రాణనాడి వంటి కాళంగి నదిపై ఉన్న సుమారు 200 ఏళ్ల నాటి బ్రిటిష్ కాలపు బ్రిడ్జి ప్రస్తుతం ప్రమాదకరంగా మారింది. దీనిపై సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అత్యంత కీలకమైన హెచ్చరికలు జారీ చేశారు. బ్రిడ్జి పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ చరిత్ర కలిగిన ఈ బ్రిడ్జి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ఏ క్షణంలోనైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రజల ప్రాణ భద్రత పట్ల మేము అత్యంత అప్రమత్తంగా ఉన్నాం. అందుకే భారీ వాహనాల రాకపోకలను అతి తక్కువ కాలంలోనే పూర్తిగా నిషేధించి, బ్రిడ్జిని మూసివేసే దిశగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాము అని స్పష్టం చేశారు. ​ఈ బ్రిడ్జి శిథిల స్థితిపై ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిస్థితి తీవ్రతను పరిశీలించారని సిఐ తెలిపారు. బ్రిడ్జి కూలిపోయే దశలో ఉండటంతో, దీనిపై ప్రైవేట్ కంపెనీల వాహనాలు, బస్సులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆయన చెప్పారు.ప్రమాదం పొంచి ఉంది, కాబట్టి భారీ వాహనాలను నియంత్రించడం తప్పనిసరి. ప్రజల భద్రత కోసమే ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నాము. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వాహనదారులు, ప్రజలు సహకరించాలి. భారీ వాహనాల రాకపోకలను ఎలా నియంత్రిస్తామనే దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు ​ఏళ్ల నాటి ఈ వారధి ప్రస్తుతం అత్యంత బలహీనంగా మారిందని, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెను ప్రమాదానికి దారితీస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు మరియు పోలీస్ యంత్రాంగం సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల పట్టణ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో జరగబోయే అనర్థాలను అరికట్టేందుకు ప్రభుత్వం, అధికారులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన ఈ చర్యలు స్థానికులకు ఊరటనిస్తున్నాయి. త్వరలోనే బ్రిడ్జిపై భారీ వాహనాల రాకపోకలపై పూర్తిస్థాయి నిషేధం అమలులోకి రానుంది. కాబట్టి వాహనదారులు, ప్రయాణికులు ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించుకోవాలని సిఐ సూచించారు. ప్రజలకి ఎటువంటి హాని జరగకుండా ముందస్తు ప్రణాళికతో ఎల్లవేళలా ప్రజలను అప్రమత్తం చేస్తున్న సూళ్లూరుపేట సీఐ

🌐 Select Language:
📰 ePaper