కోట్ల రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూమి కబ్జా

June 16, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు జూన్ 16 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో పడమటి కండ్రిగ రెవిన్యూ పరిధిలోని కోట్ల రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూమి కబ్జా గురైందని గతంలో కొందరు రాజకీయ ప్రతినిధులు కంప్లైంట్ చేయగా అప్పుడు పడమటి కండ్రిగ వీఆర్వో మరియు రెవెన్యూ సిబ్బంది కలసి కాళంగి నది బ్రిడ్జికి దక్షిణం వైపు ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 83/1,83/3,83/4,83/10 ప్రభుత్వ అనాధిన భూమి ఆక్రమిస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డులు పెట్టారు ఆ తర్వాత ఆ బోర్డులు మాయమయ్యాయి! ఎందుకు మాయమయ్యాయో అధికారులకే తెలియాలి అందులో నిర్మాణాలు కొనసాగుతున్నా కూడా అటువైపు తిరిగి చూడని రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ,సంబంధిత అధికారులు , గతంలో బోర్డులు పెట్టిన వీఆర్వో మరియు ఎమ్మార్వో ఆక్రమించిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తుంది బోర్డులు ఎందుకు మాయమైనట్టు అక్కడ నిర్మాణాలు ఎవరు పర్మిషన్ తో కొనసాగుతున్నాయి ఎందుకు ప్రభుత్వములో కట్టడాలు నిర్మిస్తున్నారు వాటికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు రేగుల సమాచారం ప్రకారం కొందరు దళారులు ఆక్రమించి వేరే వ్యక్తులకి నకిలీ డాక్యుమెంటల్ ద్వారా విక్రయాలు జరిపి అందులో కమర్షియల్ భవనాలు నిర్మిస్తున్నారు ఈ భవంతులు కట్టడానికి మున్సిపల్ అధికారులు ఏ డాక్యుమెంట్ ఆధారంగా వాళ్లకి అప్రూవల్ ఇస్తున్నారు అదే ఒక పేదవాడు ప్రభుత్వ స్థలంలో ఒక గుడిసె వేసుకొని నివసిస్తుంటే వెంటనే ఆగ మేఘాల మీద రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులు కలసి ఓ గంటలోపు ఆ గుడిసెను తొలగిస్తారు పేదలకు ఒక న్యాయం ఉన్నవాడికి ఒకలా పనిచేస్తున్నా సూళ్లూరుపేట లోని కొందరు ప్రభుత్వ అధికారులు వ్యవహారం పై ప్రజల్లో అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి ఇకనైనా ప్రభుత్వ అధికారులు నిద్రలోంచి మేల్కొని వెంటనే ఆ అక్రమ కట్టడాలను నిలిపివేసి కోట్ల రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూమిని కాపాడి ఆక్రమదారులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు

🌐 Select Language:
📰 ePaper