ఘనంగా తెలంగాణ రాష్ట్ర జనసేనపార్టీ కార్యాలయం లో రాష్ట్ర నాయకుల ఆధ్వర్యం లో జాతీయ దినోత్సవ వైద్యల దినోత్సవం
:పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 2మక్తల్ : తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యుల సేవలను కొనియాడుతూ వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ వైద్యులు గాడాల శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజ ఆరోగ్య పరిరక్షణలో వైద్యులు అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తుచేసుకుంటూ, వారి అంకితభావం, నిస్వార్థ సేవలను పార్టీ నాయకులు ప్రశంసించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వైద్యులకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు షేర్లింగంపల్లి ఇంచార్జ్ డాక్టర్ కె మాధవ రెడ్డి మక్తల్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్ డాక్టర్ స్వాతి మరియు జనసేనపార్టీ రాష్ట్ర నాయకులు మచ్చ సుధాకర్ చిరాగ్ ప్రజీత్ గౌడ్ మరియు జనసేన నాయకులు పి రత్న సరస్వతి సాయి కీర్తి గౌడ్ జోసెఫ్ ఉమ్మడి మహబూబ్ నగర్ బైరుపోగు సాంబశివుడు పాలకుర్తి ఇంచార్జ్ వెల్తూరి నాగేష్ గాదె పృథ్వి వి మహేష్ బాదేపల్లి నరేష్ గౌడ్ వినయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.