జిల్లాలో ప్రత్యేక విద్యా వాలంటీర్లను నియమించాలి

July 2, 2026 | తెలంగాణ

ఆర్జెడి సోమిరెడ్డికి తపస్ వినతి

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 2మక్తల్ : జూలై 1 నారాయణపేటనారాయణపేట జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులు అనేకంగా ఖాళీగా ఉన్నందున విద్యార్థుల బోధనకు నష్టం కలగకుండా ప్రత్యేక విద్యా వాలంటీర్లను నియమించి న్యాయం చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ పక్షానకోటకొండ ఉన్నత పాఠశాలలోఆర్జేడి సోమిరెడ్డికి వినతిపత్రం అందించారు. అలాగే పాఠశాలలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందలేదని వెంటనే అందించాలని, మన ఊరు మనబడి పనులు ఇంకా కొన్ని పాఠశాలలో అసంపూర్తిగా ఉన్నాయని వాటిని త్వరగా పూరించాలని, కన్నడ మీడియం పాఠ్య పుస్తకాలు కొరతగా వస్తున్నాయని విన్నవించారు. కార్యక్రమంలో రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి శేర్ కృష్ణారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహ నారాయణపేట అధ్యక్షులు రవికుమార్ తపస్ నాయకులు శంకర్ నాయక్ శ్రీనివాస్ భాస్కర్ రమణ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper