PS Telugu News
Epaper

డా|| బాబా సాహెబ్ అంబేడ్కర్ 135 వ జయంతి

📅 14 Apr 2026 ⏱️ 8:39 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్. నిజామాబాద్ జిల్లా

కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్ నందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం పులాంగ్ చౌరస్తా లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారుఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అంటరానితనం దళితుల హక్కుల కోసం కోట్లాడిన మహానీయుడు అంబేడ్కర్ ప్రపంచంలోనే ఏదేశాలలో లేని విధంగా భారతదేశ రాజ్యంగం రాసిన మహానీయుడు.అంబేద్కర్ రాజ్యంగా నిర్మాత, కుల వివక్షపై పోరాడి, దళితులు మరియు వెనుకబడిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడుఅంబేద్కర్ ఆశయాలు, స్వచ్చ, సమానత్వం అనీ భావలను నేటికి భారత సమాజానికి దిశానిర్దేశం* అంబేద్కర్ ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆయన స్వయం కృషితో అత్యున్నత పదవులను అదిష్టించిన గొప్ప వ్యక్తి.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షు డు బొబ్బిలి రామకృష్ణ,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు లింగం రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, నుడ చైర్మన్ కేశ వేణు,మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్,గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి,పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జావీద్ అక్రమ్,డిల్లీ భక్తవస్తలం, విపుల్ గౌడ్,యాదగిరి, శేఖర్ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top