PS Telugu News
Epaper

డా.బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి

📅 14 Apr 2026 ⏱️ 7:26 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్

నిజాంబాద్ జిల్లా నందీపేట్ మండలం వెల్మల్ గ్రామంలో ఘనంగా జరిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాట్ పల్లి నగేష్ రెడ్డి నియోజకవర్గ ఇంచార్జి వినయ్ రెడ్డి టీపీసీసీ అధికార ప్రతినిధి ఏ బి శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా నగేష్ రెడ్డి మాట్లాడుతు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135 వ ఉత్సవాలలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ వారు బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసారని, మన దేశ రాజ్యాంగాన్ని నిర్మించిన మహనీయులు అని కొనియాడారు.ఈ రోజు మనం ఇంత సేచ్చగా జీవిస్తున్నం అంటే దానికి అంబేద్కర్ గారే అని తెలిపారు.దేశ మొదటి న్యాయ మంత్రిగా పనిచేసిన ఘనత మరియు వారు తీసుకున్న నిర్ణయాలతో మహిళలకు అన్ని విధాలుగా మేలు చేసారని తెలిపారు. ఈ సందర్బంగా గ్రామస్తులతో కలిసి సహాపంక్తి భోజనం చేశారు.ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు లింగం,సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ,మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంద మహిపాల్,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గాదరి గోపి,ఏఎంసీ ఛైర్మెన్ సాయిబాబా గౌడ్,మండల్ సర్పంచ్లు ఎర్రం లింగం,గాదరి నవీన్,సంతోష్ గౌడ్,ఆర్మూర్ కౌన్సిలర్లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top