PS Telugu News
Epaper

సూళ్లూరు పేట లో అంబేద్కర్ జయంతి వేడుకలు

📅 14 Apr 2026 ⏱️ 7:23 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు)

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సూళ్లూరుపేట బస్టాండ్ సమీపంలో ఉన్న డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పుష్పమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి, కన్నంబాకం హరికృష్ణ మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. భారత రాజ్యాంగ రూపకర్తగా, బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి. సమానత్వం, సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి భారతీయుడికి ఆదర్శమని పేర్కొన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న కన్నంబాకం హరికృష్ణ మాట్లాడుతూ, అంబేద్కర్ ఆలోచనలు నేటికీ సమాజానికి మార్గదర్శకమని, ఆయన చూపిన బాటలో నడుస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత అంబేద్కర్ సిద్ధాంతాలను అవలంబించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు అభిమానులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలలో తిరుపతి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ పలు ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాల దగ్గర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు పామంజి సురేష్, వల్లం శరత్ కుమార్, దళిత నాయకుడు దాసు, కన్నంబాకం చారుణ్య తదితరులు పాల్గొన్నారు

Scroll to Top