తేజ ఇంగ్లిష్ మీడియా హై స్కూల్ విద్యార్థిలకు స్వచ్ సర్వేక్షన్ మీద అవగాహన కల్పించదం జరిగినద
పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట స్పెషల్ ఆఫీసర్ కె. దేవేంద్ర రెడ్డి సూచనలు మేరకు సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో తేజ ఇంగ్లిష్ మీడియా హై స్కూల్ విద్యార్థిలకు పాఠశాల నందు సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ శ్రీ కె.చిన్నయ ఆధ్వర్యంలో విద్యార్థిలకు స్వచ్ సర్వేక్షన్ మీద అవగాహన కల్పించడం జరిగినది మరియు వేస్ట్ సిగ్రెగ్రేషన్ కి సంబంధించి అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగముగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ తేజ ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ నందు ఆన్ సైట్ కంపోస్ట్ మరియు RRR (రెడ్యూస్–రియూస్– రీసైకిల్) ఆవిష్కరణ ద్వారా పిల్లలు పాత ఉపయోగం లేని పెన్స్ ను సేకరించి స్కూల్ నందు అందించిన యెడల బహుమతులు ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేశారు తద్వారా ప్లాస్టిక్ ను రీసైక్లింగ్ చేసి వాడుకోవడం జరుగుతుంది మరియు ప్లాస్టిక్ వినియోగం తగ్గుతుంది మరియు సోనియాగాంధీ నగర్ ఏరియా లో నివాసం ఉంటున్న మనోహర్ సింగ్ మరియు రవి తడి చెత్తను ఎరువుగా మార్చుకొని టెర్రస్ గార్డెనింగ్ కు ఉపయోగించుకోవడం జరుగుతుంది తద్వారా పురపాలక సంఘం చెత్త సేకరణ భారం తగ్గుతుంది కావున ప్రజలు ఇలాంటి ప్రయత్నాలు చేసి సూళ్లూరుపేట పురపాలక సంఘం కు సహకరించాలని మరియు చెత్తను రోడ్లపై పడవేయకుండా, తడి చెత్త, పొడి చెత్త మరియు హానికర చెత్తను డబ్బాల ద్వారా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయవలేనని మరియు సూళ్లూరుపేట ప్రజలు వారు సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకం తగ్గించి పర్యావరణను కాపాడుకోవాలని తెలియజేశారు. విద్యార్థుల చేత అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించడం జరిగినది. స్కూల్ విద్యార్థి తల్లిదండ్రులకు స్వచ్ సర్వేక్షన్ 2025-26కు సహకరించి మంచి సూళ్లూరుపేట పురపాలక సంఘముకు మంచి ర్యాంక్ సాధించే విధముగా తోడ్పడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు మరియు మెప్మ సిబ్బంది పాల్గొన్నారు
