పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించి పదవి విరమణ పొందిన పోలీసు ఉద్యోగులకు నిర్మల్ జిల్లా ఎస్పీ ఎస్ జానకి షర్మిల (ఐపీఎస్) ఘనంగా సన్మానించారు.
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో:*ప్రజల భద్రత కోసం జీవితాన్ని అంకితం చేసిన పోలీసు సిబ్బంది సేవలు పోలీసు శాఖ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి – జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్*నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయం (డీపీఓ)లో 1989 బ్యాచ్‌కు చెందిన సుదీర్ఘకాలం పోలీసు శాఖలో విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన పోలీసు ఉద్యోగులకు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన సిబ్బందికి శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం అనేది కేవలం ఒక ఉపాధి కాదని, ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడే అత్యంత బాధ్యతాయుతమైన సేవ అని అన్నారు. ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్లు, ఎండా వానా తేడా లేకుండా, కుటుంబాలకు దూరంగా ఉండి విధులు నిర్వర్తించే ప్రతి పోలీసు ఉద్యోగి సమాజానికి ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు.పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడంలో, శాంతిభద్రతల పరిరక్షణలో, నేర నియంత్రణలో 1989 బ్యాచ్‌కు చెందిన ఈ సిబ్బంది అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావం నేటి పోలీసు సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.ఉద్యోగ విరమణ అనేది ప్రభుత్వ విధులకు మాత్రమే ముగింపు అని, సమాజ సేవకు కాదని పేర్కొంటూ, తమ అనుభవాన్ని యువతకు, సమాజానికి పంచుతూ మార్గదర్శకులుగా కొనసాగాలని సూచించారు. పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా 1989 బ్యాచ్‌కు చెందిన పదవీ విరమణ పొందిన **జె. దిగంబర్ (ఏఎస్ఐ–1704, భైంసా రూరల్ పోలీస్ స్టేషన్), డి. బాబారావు (ఏఎస్ఐ–1738, నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్), ఎం. బాలుడు (ఏఆర్‌పీసీ–3885, డీఏఆర్ నిర్మల్)**లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, పోలీసు శాఖకు వారు అందించిన విశిష్ట సేవలను ప్రశంసిస్తూ సత్కరించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డి. ఉపేందర్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఓ) ఎం.డి. యూనుస్ అలీ, ఆర్‌ఎస్‌ఐ శేఖర్, జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు, పోలీసు సిబ్బంది, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.