నేటి బాల బాలికలే రేపటి భావి భారత పౌరులు

June 18, 2026 | తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు ప్రభుత్వం కృషి చేయాలి

దేవునిబండ తండా గ్రామ సర్పంచ్ ఎం శ్రీను ఉపసర్పంచ్ బాదావత్ శ్యామ్ లాల్

దేవునిబండ తండా ప్రభుత్వ పాఠశాలలో నోటు పుస్తకాల పంపిణీ

పాఠశాలకు విద్యార్థులకు ఎల్లపుడు నా సహాయ సహకారాలు అందిస్తను సర్పంచ్ శ్రీను

( పయనించే సూర్యుడు జూన్ 19 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్) గ్రామ పరిధిలోని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నూతన విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన నోటు పుస్తకాలను గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు పాఠశాల హెడ్మాస్టర్ గ్రామ కార్యదర్శి పాఠశాల సిబ్బంది చేతుల మీదుగా పంపిణీ చేశారు. ​విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: సర్పంచ్, ఉప సర్పంచ్ ​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ ఎం శ్రీను పుస్తకాలను పంపిణీ చేసిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.ప్రభుత్వం కల్పిస్తున్న ఇలాంటి సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, క్రమశిక్షణతో చదువుకుని తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సర్పంచ్ శ్రీను కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి గీత హెడ్మాస్టర్ భాస్కర్ తండా పెద్దలు శంకర్ తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper