ప్రభుత్వం నిబంధనకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలను దుస్తులను అమ్ముతున్న శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేయాలి

June 18, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు 18 6 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రభుత్వ అనుమతి లేకుండా పాఠ్యపుస్తకాలను దుస్తులను అమ్ముతున్న శ్రీ చైతన్య బుక్స్ స్టోర్ ను సీజ్ చేయాలని స్టోర్ ముందు ధర్నా ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు ఎం నరేందర్.. మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు రోజులు నడుస్తుంది నేటికీ ప్రభుత్వం కానీ విద్యాశాఖ అధికారులు గానీ కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలను అరికట్టడంలో విఫలమయ్యారని వారు అన్నారు ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ నిబంధన మేకాతరుస్తూ హైకోర్టు జీవోను సైతం తమకు అవసరం లేకుండా వారు ఇష్టాను రీతిలో పాఠ్యపుస్తకాలను అమ్ముతున్న స్థానిక మండల విద్యాశాఖ అధికారి ఏమాత్రం పట్టింపు లేకుండా వివరించడం అనేక అనుమానాలకు దారితీస్తుందని వారు అన్నారు శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాలకు మండల విద్యాశాఖ అధికారి వ్యక్తిగత అండదండలను అందిస్తున్నారా అనే అనుమానాలు వస్తున్నాయని దీనిపైన మండల విద్యాశాఖ అధికారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని వారు అన్నారు అదేవిధంగా పాఠశాలలో 1000 మంది విద్యార్థుల నుండి 1500 రూపాయల చొప్పున మేత యాప్ పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారని వారు అన్నారు విద్యార్థులకు అవసరం లేని పుస్తకాలను విద్యార్థులపై రుద్దే ప్రయత్నాలు జరుపుతున్నారని వారు అన్నారు అదే విధంగా లేని ర్యాంకులు మార్కులు చూయించి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం సరైంది కాదని వారు అన్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు మొద్దు నిద్రని వీడి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని జిల్లా కలెక్టర్ విద్య పేరుతో వ్యాపారం చేస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకొని సీట్ చేయాలని వారికి డిమాండ్ చేశారు… ఈ కార్యక్రమంలో పి డి ఎస్ సి ఆర్మూర్ ఏరియా అధ్యక్షులు డి నిఖిల్ , నాయకులు వినోద్ భూమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper